స‌న్నీ డియోల్ బోర్డ‌ర్ -2 ట్రైల‌ర్ సెన్సేష‌న్

జ‌న‌వ‌రి 23న ప్రేక్షకుల ముందుకు

hellotelugu-Border-2MovieTrailer

ముంబై : ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్న చిత్రం బోర్డ‌ర్ -2 . ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గా భార‌త జాతి గ‌ర్వించ ద‌గిన మ‌హోన్న‌త నాయ‌కుడు ఆజాద్ హిందూ ఫౌజ్ ఫౌండ‌ర్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జ‌యంతి జ‌న‌వ‌రి 23న విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టంచారు అధికారికంగా. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్స్, గ్లింప్స్, చిత్రాలు అత్యంత జ‌నాద‌ర‌ణ‌ను పొందాయి. గ‌ణతంత్ర దినోత్స‌వం జ‌న‌వ‌రి 26 కంటే ముందు థియేట‌ర్ల‌లోకి రానుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించాడు బోర్డ‌ర్ -2 మూవీని. ఈ ఐకానిక్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తిరిగి నటిస్తున్నారు. ఇప్ప‌టికే బోర్డర్ -1 బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. శత్రువులతో పోరాడటానికి వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టితో స‌న్నీ డియోల్ జతకట్టారు.

1971 ఇండో-పాక్ యుద్ధంలో జ‌రిగిన య‌ధార్థ సంఘ‌ట‌నల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు అనురాగ్ సింగ్ బోర్డ‌ర్ ను రూపొందించాడు. తాజా చిత్రం బోర్డర్ 2 శక్తివంతమైన ప్రపంచాన్ని , భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం కలిసికట్టుగా పోరాడినప్పుడు ఏమి జరుగుతుందో చూపిస్తుంది. సీనియర్ నటుడు సన్నీ డియోల్ చెప్పిన శక్తివంతమైన సంభాషణలు, దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, అహన్ శెట్టిల ఉత్కంఠ భరితమైన నటన ఆక‌ట్టుకునేందుకు రెడీ అయ్యింది. అంతే కాకుండా ఐకానిక్ పాటలను హృద్యంగా పునః సృష్టించడంతో, బోర్డర్ 2 ట్రైలర్ భావోద్వేగాలను రగిలించేందుకు సిద్ద‌మైంది. దీంతో ఈ సినిమా మ‌రింత అంచ‌నాలు పెంచేలా చేసింది.

Exit mobile version