గూగుల్ డేటా సెంట‌ర్ తో భారీగా కొలువులు

శంకుస్థాప‌న చేయ‌నున్న సీఎం చంద్ర‌బాబు

hellotelugu-VizagIT

అమ‌రావ‌తి : టెక్ దిగ్గ‌జం గూగుల్ ఏఐ డేటా సెంట‌ర్ కు శంకుస్తాప‌న చేయ‌బోతున్నారు సీఎం చంద్ర‌బాబు ఈనెల 28. ఇందుకు విశాఖ జిల్లా వేదిక కానుంది. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి ద‌క్క‌నుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డేటా సైంటిస్ట్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో అనుబంధ రంగాల నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్‌వర్కింగ్ వంటి రంగాల్లో స్థానికంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్లతో ఏఐ ఏకోసిస్టమ్ ఏర్పాటు కానుంది.

గూగుల్ ఏఐ క్లౌడ్ సేవల ద్వారా విశాఖ ఆసియాలోనే ప్రధాన కేంద్రంగా మారే అవకాశం మారనుంది. దీంతో పాటు ఏఐ ఆధారిత కంపెనీలకు కూడా విశాఖ గమ్య స్థానంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏఐ ఎకోసిస్టమ్ తో ఐటీ స్టార్టప్ లు, రీసెర్చ్ సెంటర్లు క్లౌడ్, సెమీ కండక్టర్ కంపెనీలు విశాఖకు క్యూ కట్టే అవకాశముంది.. గూగుల్ సహా ఇతర టెక్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల కోసం గ్రీన్ ఎనర్జీని సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ టెక్ సంస్థలన్నీ విశాఖ వైపు చూస్తుండటంతో ఇప్పుడు నగరానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వికసిత్ భారత్ 2047 విజన్ కు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ కేంద్రంగా మార్చే క్రమంలో గూగుల్ పెద్ద ముందడుగు కానుంది.

Exit mobile version