హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ హైదరాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మకమైన గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నగరంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఉజ్వల వారసత్వాన్ని వేడుకగా జరుపు కోవడానికి తాను ఎదురు చూస్తున్నానని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ వేడుకలు మార్చి 19న గురువారం ఉగాది పర్వదినం సందర్బంగా ఇప్పటికే ప్రకటించిన వారికి ఇవ్వనున్నారు. ఈ అవార్డులలో భాగం కావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు మాధురి దీక్షిత్.
ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ప్రేరేపిస్తూనే ఉన్న కథనం, సంగీతం , అసాధారణ ప్రతిభ గొప్ప వారసత్వం కోసం ఆమె తెలుగు సినిమాను ప్రశంసించారు. పరిశ్రమకు నిజమైన వెన్నెముక అయిన అట్టడుగు స్థాయి కళాకారులు , సాంకేతిక నిపుణులను గౌరవించే ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని ఆమె నొక్కి చెప్పారు. హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ ఉజ్వల వారసత్వాన్ని వేడుకగా జరుపు కోవడానికి తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తనతో పాటు బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈమె కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణకు ఉజ్వలమైన కళాత్మక స్ఫూర్తి ఉందని, అన్ని సృజనాత్మక రంగాలలో శ్రేష్ఠతను గుర్తించే ఈ రాత్రిలో భాగం కావడం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నానని ఆమె తెలిపారు.
