Yuzvendra Chahal : భారతీయ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ప్రస్తుతం తను ఒంటరిగా ఉన్నాడు. స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకోవడంతో అందరి కళ్లు ఈ క్రికెటర్ పై పడ్డాయి. ఏమైందో ఏమో కానీ అందమైన తన భార్య నుంచి విడాకులు పొందాడు. భారీ ఎత్తున భరణం చెల్లించాడు. ఇందుకు సంబంధించి ముంబై కోర్టు సంచలన తీర్పు వెలవరించింది. కోట్లల్లో ఉంటుందని సమాచారం. ఇది పక్కన పెడితే మనోడు ఐపీఎల్ లో దుమ్ము రేపాడు. అనూహ్యంగా తనను వదులుకుంది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. ఇదే సమయంలో తాజాగా యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) గురించి కీలక అప్ డేట్ వచ్చింది. అది ఏమిటంటే తను ఇప్పుడు ఫ్రీగా ఉండడంతో , కొత్త అమ్మాయి వలలో పడ్డాడని, పీకల లోతు ప్రేమలో కూరుకు పోయాడని, డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Yuzvendra Chahal Dating With
సదరు డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు మోస్ట్ పాపులర్ రేడియో జాకీగా పని చేస్తున్న మహ్వాష్. ఈ సందర్భంగా మొదటిసారిగా ఈ ప్రచారంపై స్పందించాడు చాహల్. తన పాడ్‌కాస్ట్ కోసం రాజ్ షమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనతో డేటింగ్ చేయడం లేదన్నాడు. ఎవరో కావాలని తనపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వాపోయాడు. అయితే ఎవరి అభిప్రాయాలు వారివన్నాడు. వారికి ఇతరుల గురించి ప్రశ్నించే హక్కు తప్పకుండా ఉంటుందన్నాడు చాహల్. ధనశ్రీ వర్మతో విడాకుల నుండి బయట పడటానికి తనకు సమయం కావాలని అన్నాడు. ఇప్పుడే ఇంకొకరి గురించి తాను ఆలోచించడం లేదన్నాడు. అయితే దుబాయ్ వేదికగా తామిద్దరం కలిసి ఉన్నట్టు ఫోటోలు బయటకు రావడం పట్ల స్పందించాడు.
Also Read : Minister Uttam Kumar Shocking Comments : కాళేశ్వరం జలాశయం కేసీఆర్ దే పాపం



















