MP Midhun Reddy – Liquor Scam : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్

రాజ‌మండ్రి జైలుకు త‌ర‌లింపు

Hello Telugu - MP Midhun Reddy - Liquor Scam

Hello Telugu - MP Midhun Reddy - Liquor Scam

Midhun Reddy : విజ‌యవాడ – ఏపీ లిక్క‌ర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో A-4గా మిథున్‌రెడ్డి (Midhun Reddy) ఉన్నారు. కాసేపట్లో మిథున్‌రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు పోలీసులు. అంతకు ముందు వాదనల సందర్భంగా తనను నెల్లూరు జైలు కు పంపించాలని అభ్యర్థించారు ఎంపీ. తనకు Y plus సెక్యూరిటీ ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా నెల్లూరు జిల్లా జైలుకు తరలించాలని కోరారు మిథున్ రెడ్డి. తనకు బ్లడ్ క్లాట్స్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయనీ, అవసరాన్ని బట్టి హాస్పిటల్ లో చికిత్స సౌకర్యం కల్పించాలని అన్నారు.

MP Midhun Reddy – Liquor Scam Case

కాగా త‌న‌కు 409 సెక్షన్ వర్తించదని మిథున్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందనీ కోర్టు కు తెలిపిన సిట్ తరపు లాయర్. మిథున్ రెడ్డి అరెస్ట్ అవసరానికి సంబంధించి 29 కారణాలను కోర్టుకు చూపించిన సిట్ తరపు న్యాయవాదులు. చివరికి సిట్ న్యాయవాదుల వాదనతో ఏకీభవించారు న్యాయమూర్తి.

ఈ సంద‌రర్భంగా సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎంపీ. త‌న‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని, అక్ర‌మ కేసులు బ‌నాయించార‌ని ఆరోపించారు. కూట‌మి స‌ర్కార్ ఆధారాలు లేక పోయినా కేసులు న‌మోదు చేశార‌ని వాపోయారు ఎంపీ.

Also Read : Harish Rao Fired on Telangana Govt : తెలంగాణలో లా అండ్ ఆర్డ‌ర్ ఫెయిల్

Exit mobile version