Harish Rao : హైదరాబాద్ – తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao). సీఎంకు సోయి అన్నది లేకుండా పోయిందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.రేవంత్ రెడ్డి చీకటి బాగోతం కప్పి పుచ్చుకునేందుకు బజారులోని చెత్త అంతా మీడియా ముందు ఉంచాడని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్ట్ ఎజెండాలో ఉందని ఏపీ ఇరిగేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారని, కానీ రేవంత్ రెడ్డి ఏమో బనకచర్ల అసలు చర్చకు రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొల్లాపూర్ సభలో కేసీఆర్ ను విమర్శించేందుకే సమయం కేటాయించారని ఇక ఏం అనాలో తెలియడం లేదన్నారు.
Harish Rao Slams Telangana Govt
డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి.. సీఎం అయిన తరువాత జై తెలంగాణ అంటాడేమో అనుకున్నామని కానీ అనలేదన్నారు. కర్ణాటకకు చెందిన AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జై తెలంగాణ అనలేదా.? రాష్ట్ర ప్రయోజనాలు ప్రపంచం ముందు ఉంచాడు. నీలా కేటీఆర్ బ్యాగ్ లు మొయ్య లేదన్నారు . కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాల విద్యార్థులు హాస్పిటల్ లో ఉంటున్నారు. గ్రామాల్లో పాలన పడకేసింది. జూబ్లీ హిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లోనే పాలన చేస్తున్నావని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే అసెంబ్లీ పెట్టాలని అన్నారు. ఈడీ ఎందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడం లేదు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అండగా ఉంటున్నాడని ఆరోపించారు.
Also Read : CM Chandrababu Success : వేంకటేశ్వర స్వామి వల్లనే సీఎం అయ్యా
