Midhun Reddy : విజయవాడ – ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని (Midhun Reddy) అదుపులోకి తీసుకుంది సిట్. తనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అయితే ఆదివారం కావడంతో కోర్టు ఉంటుందా లేదా అన్నది తెలియదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎంపీ విచారణకు హాజరయ్యారు. కొన్ని గంటల పాటు తనను సిట్ ప్రశ్నించింది. చివరకు కీలక ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా తన అరెస్ట్ పై స్పందించారు ఎంపీ . ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరోటి కాదన్నారు. కావాలని కూటమి సర్కార్ వైసీపీకి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నదని వాపోయారు.
YSRCP MP Midhun Reddy Arrested
గతంలో కూడా తనపై పలు కేసులు నమోదు చేశారని, కానీ నిరూపించలేక పోయారని అన్నారు ఎంపీ. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను అదుపులోకి తీసుకున్నారని ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు. అరెస్ట్ చేసిన విషయాన్ని ఎంపీ కుటుంబీకులకు తెలియ చేశామని చెప్పారు సిట్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 5 గంటలకు పైగా విచారించారు .
ఇదే సమయంలో లిక్కర్ కేసు ప్రాథమిక చార్జ్‌షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ చార్జ్‌షీట్‌లో 100కు పైగా RFSL నివేదికలు పొందిపరిచినట్టు సమాచారం. రూ.62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 268 మంది సాక్షులను సిట్ విచారించింది.
Also Read : Priyanka Chaturvedi Fired on BCCI : బీసీసీఐ నిర్వాకం ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
