Priyanka Chaturvedi Fired on BCCI : బీసీసీఐ నిర్వాకం ప్రియాంక చ‌తుర్వేది ఆగ్ర‌హం

డ‌బ్ల్యూసీఎల్ టోర్నీలో భారత్ ఆడ‌డంపై ఫైర్

Hello Telugu - Priyanka Chaturvedi Fired on BCCI

Hello Telugu - Priyanka Chaturvedi Fired on BCCI

Priyanka Chaturvedi : ముంబై – శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది నిప్పులు చెరిగారు. భారత క్రికెటర్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాల్గొంటుండ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా బర్మింగ్‌హామ్ వేదికగా భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య ఈనెల 20న ఆదివారం మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీకి బీసీసీఐ అనుమతించడం ప‌ట్ల ఎంపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది సిగ్గుచేటని విమర్శించారు. ఓ వైపు పాక్ తో ఎలాంటి సంబంధాలు లేవ‌ని మోదీ స‌ర్కార్ అంటుంటే ఇంకో వైపు బీసీసీఐ ప‌ట్టించుకోకుండా ఎలా ఆడేందుకు అనుమతి ఇస్తార‌ని ప్ర‌శ్నించింది.

Priyanka Chaturvedi Fired on BCCI

జ‌మ్మూ కాశ్మీర్ లోని ప‌హ‌ల్గాం వేదిక‌గా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చంపిన వారిని ప‌ట్టుకోనేలేదు. ఇరు దేశాల మ‌ధ్య స‌రైన సంబంధాలు లేవు. ఎందుకు అనుమ‌తి ఇచ్చారో చెప్పాల‌ని ఆమె బీసీసీఐని నిల‌దీశారు. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు ప్రియాంక . పహల్గాం ఉగ్రదాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే బీసీసీఐ, ఐసీసీలు తమ డబ్బు గురించి ఆలోచించడం నైతిక దివాళా కోరుతనాన్నే సూచిస్తుందని అన్నారు.

వీరికి బుద్ది లేక పోయింది..కానీ ఆట‌గాళ్ల‌కు ఏమైంద‌ని ప్ర‌శ్నించారు శివ‌సేన యూటీబీ ఎంపీ. ఆమె ఎక్స్ వేదిక‌గా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు .

Also Read : Europe Sanctions – Russia Shocking : రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన యూరోపియన్ యూనియన్

Exit mobile version