డ్వాక్రా ఉత్ప‌త్తుల మార్కెటింగ్ కోసం ‘స్వ‌యం ఏపీ బ్రాండ్’

విజ‌య‌వాడ‌లో స‌ర‌స్ మేళాలో ప్ర‌స్తావించారు సీఎం చంద్ర‌బాబు

hellotelugu-SwayamAP

విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన జాతీయ స‌ర‌స్ మేళా – 2026ను ప్రారంభించారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. గ‌వ‌ర్న‌ర్ న‌జీర్, కేంద్ర మంత్రులు శివ‌రాజ్ సింగ్ చౌహాన్ , రామ్మోహ‌న్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం ప్ర‌సంగించారు. డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందించిన స్వయం ఏపీ బ్రాండ్ గురించి ప్రస్తావించారు. దసరా శరన్నవరాత్రుల వేళ విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను నిర్వహించటం మరింత శోభ తెచ్చిందన్నారు. సరస్ మేళాను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారీ శక్తికి, నవ భారత శక్తికి ప్రతిరూపం అని కొనియాడారు చంద్ర‌బాబు నాయుడు. మహిళా శక్తిని చాటేందుకే ఢిల్లీ వెలుపల తొలిసారి విజయవాడలో మహిళల జాతీయ సరస్ మేళా నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు.

గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచటం, మహిళా పారిశ్రామికవేత్తను ప్రోత్సహించటం, గ్రామీణ ఉత్పత్తులకు గుర్తింపు తేవడమే ఈ మేళా లక్ష్యం అని ప్ర‌క‌టించారు సీఎం. మహిళలు ఎదిగితే ఆ కుటుంబం, ఆ సమాజం దేశం ఎదుగుతుందని అన్నారు. 6 కోట్ల మంది లక్ పతీ దీదీలను తయారు చేయటమే ప్రధాని మోదీ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. నిన్నటి పొదుపు సంఘాలు నేడు వ్యాపార సంస్థలుగా ఎదిగాయని అన్నారు. ఇవే రేపటి అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాల‌ని ఆకాంక్షించారు సీఎం. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన డ్వాక్రా పొదుపు ఉద్యమం నేడు దేశంలోనే గర్వించే విజయలను సాధిస్తోందని అన్నారు. 11 లక్షల స్వయం సహాయ సంఘాలు రూ.69 వేల కోట్ల టర్నోవరుతో ఏపీని అగ్రస్థానంలో నిలిపార‌ని పేర్కొన్నారు. ఏడాది కాలంలో లక్ష మంది స్వయం సహాయ సంఘాల మహిళల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం అని తెలిపారు సీఎం.

5 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నాం అన్నారు. 10 లక్షల మంది మహిళల్ని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చే లక్ష్యంతో పని చేస్తామ‌ని పేర్కొన్నారు. ఏపీలో మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు స్వయం ఏపీ బ్రాండ్ తీసుకు వచ్చామ‌ని వెల్ల‌డించారు. ఈ-కామర్స్, ఆన్ లైన్ షాపింగ్ లో స్వయం ఏపీ పేరుతో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. సంక్షేమంతో పాటు మహిళలకు భరోసా ఇచ్చేలా వారి సాధికారిత కోసం పని చేస్తున్నాం అన్నారు. మహిళా శక్తిని బలోపేతం చేసేలా తల్లికి వందనం ఇస్తున్నాం అని తెలిపారు. స్త్రీశక్తితో ఉచిత బస్సు ప్రయాణంతో 100 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారన్నారు.

Exit mobile version