YS Sharmila : విజయవాడ – ఏపీపీఎస్సీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) నిప్పులు చెరిగారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఆంధ్రరత్న భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నయా భారత్ కాదు..మోడీ చేతిలో దగా పడ్డ దగా భారత్ అంటూ ఆరోపించారు. మోడీ చెర నుంచి దేశాన్ని విడిపించే మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉందన్నారు. దేశాన్ని కార్పొరేట్లకు దాచిపెట్టి, RSS రాజ్యాగాన్ని అమలు చేయడమా నయా భారత్ అంటే అని ప్రశ్నించారు. కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఆనాడు ఖూనీ చేశారని ఆరోపించారు. నేడు చంద్రబాబు పులివెందులలో అదే చేశారని మండిపడ్డారు. ఇద్దరు కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వాళ్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Slams PM Modi
ఇద్దరికి పెద్ద తేడాలేదు. రిగ్గింగ్ చేయడం అంటే వీళ్ళు తాలిబన్ లతో సమానమేనని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు షర్మిల. మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతోమంది త్యాగఫలం అని గుర్తించాలన్నారు. ఎంతో మంది పోరాటాలు చేస్తే లభించింది ఈ స్వేచ్ఛ అన్నారు. ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు షర్మిలా రెడ్డి (YS Sharmila). స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ ది కీలక పాత్ర పోషించారన్నారు. ఈ దేశ అభివృద్ధికి పునాదులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీనేని గుర్తించాలన్నారు.
అప్పుడు,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒకటే సిద్ధాంతం, దేశ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం అని స్పష్టం చేశారు.
అనాడు ఈ దేశం బ్రిటిష్ చేతిలో బందీ కాగా ఇవాళ మళ్లీ మోడీ చేతిలో బందీ అయిందని ఆరోపంచారు.
మోడీ నయా భారత్ అనడం విడ్డూరం అన్నారు. ఎక్కడుంది నయా భారత్ ? అంటూ ప్రశ్నించారు. RSS జెండా, అజెండా అమలు చేయడం నయా భారతా అని నిలదీశారు. దేశ సంపదను అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టడం నయా భారత్ అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
Also Read : Harish Rao Fired on Telangana Govt : వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంపు దారుణం : హరీశ్ రావు
