YS Sharmila : విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. అన్నమయ్య ప్రాజెక్టుపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మంగళవారం షర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సోయి లేకుండా పోయిందన్నారు. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి 5 ఏళ్లు దాటినా పునర్ నిర్మాణానికి దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. 5 ఊళ్లు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది ఇప్పటి వరకు లేదని వాపోయారు.
YS Sharmila Slams CM Chandrababu
సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికి ఆదుకున్నది లేదంటూ ధ్వజమెత్తారు షర్మిలా రెడ్డి. గత YCP , నేడు కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్ట్ ను అనాథ ప్రాజెక్టు కింద మార్చారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రూ. 800 కోట్లతో మరమత్తులు అంటూ హడావుడి చేశారు తప్పా పునర్ నిర్మించిన పాపాన పోలేదన్నారు . పునరుద్ధరణ పేరుతో 3 ఏళ్లు గడిపారే తప్పా… తట్టెడు మట్టి వేయలేదంటూ ఎద్దేవా చేశారు షర్మిలా రెడ్డి. బాధిత కుటుంబాలకు ఇండ్లు అంద లేదన్నారు. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాల ఇవ్వక పోవడం దారుణమన్నారు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలనీ, దర్యాప్తు కొనసాగిస్తామని కాలయాపన చేశారే తప్పా చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు.
Also Read : CM Chandrababu Challenge : జగన్ కు దమ్ముంటే చర్చకు రావాలి : సీఎం
