YS Sharmila Fired on AP Govt : స‌ర్కార్ హామీలు బారెడు అమ‌లు మూరెడు

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

YS Sharmila : విజ‌య‌వాడ : ఏపీ కూట‌మి స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆమె విజ‌య‌వాడ‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు హామీలు ఇవ్వ‌డంలో ప్ర‌ధాని మోదీని మించి పోయార‌ని, కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఇసుమంత కూడా అమ‌లు చేసిన పాపాన పోలేద‌న్నారు. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అర‌చేతిలో స్వ‌ర్గం చూపిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏ పథకం అమలు చేసినా సగం సగమేన‌ని, అన్నింటా కోతలేనంటూ ఎద్దేవా చేశారు ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila). ఆటో డ్రైవర్ అన్నలకు చంద్రబాబు చేసింది ఘరానా మోసం అంటూ మండిప‌డ్డారు. ⁠మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఎన్నికల్లో ఊదర గొట్టిన ప్రసంగాలకు, ⁠అమలు చేసిన ఆటో డ్రైవర్ సేవలో 15 వేల పథకానికి పొంతనే లేదన్నారు ష‌ర్మిలా రెడ్డి.

YS Sharmila Slams AP Govt

⁠ఖాకీ చొక్కాలు వేసుకుని, ఆటోల్లో తిరిగినట్లు ఫోటోలకు ఫోజులు ఇవ్వ‌డంతోనే స‌రిపోయింద‌న్నారు. ప్ర‌చారానికి ఎక్కువ ప‌నికి త‌క్కువ‌గా మారి పోయిందంటూ చంద్ర‌బాబును ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ⁠డ్రైవర్ అన్నలకు మసి పూసి మారేడుకాయ చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ⁠ఆటో డ్రైవర్లను మోసగించడంలో గత YCP ప్రభుత్వానికి, నేడు కూటమి ప్రభుత్వానికి తేడా లేనే లేద‌న్నారు. ⁠జగన్ 2.60 లక్షల మందికి ఇస్తే, చంద్రబాబు 2.90 లక్షల మందికే ఇచ్చారని ఫైర్ అయ్యారు ఏపీపీసీసీ చీఫ్‌ . ఆటో డ్రైవర్లను మోసగించడంలో ఇద్దరూ దొందు దొందేన‌ని అన్నారు. రాష్ట్రంలో బ్యాడ్జి కలిగిన ప్రతి డ్రైవర్ కి ఏటా 15 వేలు ఇస్తాం అన్నారని చెప్పార‌ని పేర్కొన్నారు.

Also Read : AP Speaker Ayyannapatrudu Important Update : కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో ఏపీ స్పీక‌ర్

Exit mobile version