YS Sharmila : అమరావతి – టీడీపీ కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.
మహాశక్తి పథకం ఏమైందని ప్రశ్నించారు. ఈ పథకాన్ని బంగాళాఖాతంలో కలిపేశారంటూ ఆరోపించారు. సూపర్ సిక్స్ లో ఒక సిక్స్ కి పంగనామాలు పెట్టారంటూ మండిపడ్డారు. మహాశక్తి పథకంపై ఇవ్వాళ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పడం ప్రజలను మోసం చేయడం తప్పా ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రతి నెలా ప్రతి మహిళకు రూ. 1500 జమ చేస్తామంటూ ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చారని, ఇప్పుడు చేతులు ఎత్తేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
YS Sharmila Shocking Comments on AP Govt
మంచి ప్రభుత్వం అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వానికి ఇది నిజంగా సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). మంచి ముసుగులో మహిళలను ముంచుతున్నారని ఆరోపించారు. ఆమధ్య సీఎం చంద్రబాబు పథకాన్ని P4 లో కలిపామని,అమలు చేసేశామని అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ ఎక్కడ అని అడిగే వాళ్ళ నాలుక మందం అంటూ ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక బాధ్యత కలిగిన మంత్రి స్థానంలో ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు మహాశక్తి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనంటూ చెప్పడం దారుణమన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాదని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. సూపర్ సిక్స్ లో హామీల్లో పెట్టి మహిళల ఓట్లు దండుకొనే ముందు తెలియదా ఈ పథకం ఆర్థిక భారం అని అని నిలదీవారు. ఆర్థిక అంచనా లేకుండానే గుడ్డిగా వేల కోట్ల హామీ ఇచ్చారా అని నిలదీశారు.
Also Read : MLC Kavitha Fired on CM : రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం
















