YS Sharmila Fired on CM Chandrababu : సీఎం చంద్రబాబు కామెంట్స్ వైఎస్ షర్మిల సీరియ‌స్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీక‌రించేలా మాట్లాడితే ఎలా

Hello Telugu - YS Sharmila Fired on CM Chandrababu

Hello Telugu - YS Sharmila Fired on CM Chandrababu

YS Sharmila : విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) నిప్పులు చెరిగారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆయ‌న చేసిన కామెంట్స్ ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు. మీరు వేసిన ముళ్ళకంచె దాటుకుంటూ, ఏడాది నుంచి సగమే జీతం తీసుకుంటూ రోజుకు 16 వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నార‌ని ఆ విష‌యం గుర్తించ‌కుండా నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించ‌చారు. 5.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి చేస్తున్నారంటే ఇది కార్మికుల శ్రమ కాకపోతే మరేంటి ? తప్పులన్నీ యాజమాన్యం దగ్గర పెట్టుకొని కార్మికుల మీద నిందలు మోపడం ఏంటి అని నిల‌దీశారు. వారి జీతాలను కోస్తామని చెప్పడం ఏంటి ? అరకొర సదుపాయాలతో బలవంతపు టార్గెట్లు పెట్టడం ఏంటి ? 7.3 మిలియన్ సామర్థ్యంలో 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గడానికి ప్రభుత్వ చర్యలే కారణం అని ఆరోపించారు.

YS Sharmila Slams CM Chandrababu

నష్టాలను కార్మికుల మీద రుద్దడం సబబు కాదని అన్నారు ష‌ర్మిలా రెడ్డి. ఎంతటి ఉత్పత్తినైనా సాధించి పెట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇచ్చిన సర్క్యులర్ తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 7.3 మిలియన్ టన్నుల పూర్తి స్థాయి ఉత్పత్తికి కావాల్సిన రా మెటీరియల్ అందించాలని అన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేక పోతే ఆందోళ‌న‌ను ఉద్ధృతం చేస్తామ‌న్నారు. ఈ విషయంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీపీసీసీ చీఫ్‌. చంద్ర‌బాబు త‌క్ష‌ణ‌మే కార్మికుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : MP Eatala Rajender Shocking Comments : కుల‌, మ‌తాల మీద రాజ‌కీయాలు న‌డ‌వ‌వు

Exit mobile version