YS Sharmila : విజయవాడ – ఏపీ లిక్కర్ స్కాం విచారణ నత్త నడకన సాగుతుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ కొండను తవ్వి ఎలకను పట్టినట్లుందంటూ ఎద్దేవా చేశారు. గురువారం షర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. ఎంతసేపు డిస్టిలరీ ల చుట్టే విచారణ సాగుతోందని, లిక్కర్ స్కాం వెనుక కమీషన్లు మాత్రమే చూపుతున్నారంటూ మండిపడ్డారు. కమీషన్ల కోసం డిస్ట్రిలరీలను బెదిరించారని చెప్తున్నారని అసలు వాస్తవాలు మాత్రం వెల్లడించడం లేదంటూ ఆరోపించారు.
YS Sharmila Demands Liquor Scam Clarification
డెన్ లు ఉన్నాయని, కిక్ బ్యాగ్స్ అందాయని,నెలకు 50 నుంచి 60 కోట్లు ముడుపులు అందాయని అంటున్నారని అవి ఎవరెవరికి అందాయో చెప్పాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు షర్మిలా రెడ్డి.
లిక్కర్ స్కాం లో 3500 కోట్లు మాత్రమే కాదని, డిస్టిలరిల దగ్గర నుంచి కన్జ్యుమర్ వరకు మద్యం చేరడం మొత్తం కుంభకోణమేనని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి జరిగిందంటూ ధ్వజమెత్తారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతి ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే చోటు చేసుకుందని, ఇది ఎనిమిదో ప్రపంచ వింతగా పేర్కొన్నారు ఏపీపీసీసీ చీఫ్.
డిజిటల్ పేమెంట్స్ ఉండాలని చెప్పే ఈ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ అనడం బహుశా ఎక్కడా జరగలేదన్నారు. ఏపీ లిక్కర్ స్కాం అనేది అతి పెద్ద ఆర్థిక నేరంగా పరిగణించాలని స్పష్టం చేశారు. ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం అమ్మకాలు చేసింది అనధికార అమ్మకాల కోసమేతప్పా మరోటి కాదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
Also Read : KTR Birthday – KCR Interesting Comments : కేసీఆర్ ఆశీర్వాదం కేటీఆర్ సంతోషం

















