YS Sharmila : విజయవాడ : విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనపై కూటమి సర్కార్ అనుసరిస్తున్న మొండి వైఖరి తగదని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). యాజమాన్య ఏకపక్ష తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. హక్కుల సాధనకు ఉద్యోగులు పోరాటం చేస్తుంటే, వారి ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం అత్యంత దారుణం అన్నారు. ఇది ప్రభుత్వ నిరంకుశతత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 58 సార్లు చర్చలు జరిపినా డిమాండ్లను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారంటే దీని వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే 63 వేల మంది ఉద్యోగులను పరోక్షంగా సమ్మెలోకి ఉసిగొల్పుతున్నట్లు ఉందన్నారు.
YS Sharmila Shocking Comments
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, నేటి నుంచి ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మెపై పట్టు వీడాలని అన్నారు. వెంటనే విద్యుత్ JACని మళ్ళీ చర్చలకు పిలవాలని కోరారు. ఉద్యోగులు పెట్టిన 29 డిమాండ్లన్నీ న్యాయ బద్ధమైనవేనని పేర్కొన్నారు . వాటిని తక్షణమే అమలు చేయాలని కోరారు షర్మిలా రెడ్డి. గత 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్న 27 వేల మంది కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు అన్ లిమిటెడ్ మెడికల్ పాలసీ అమలు చేయాలన్నారు. 7500 మంది జూనియర్ లైన్ మెన్ లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింప చేయాలన్నారు. కారుణ్య నియమాకాల విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని స్పష్టం చేశారు.
Also Read : Minister Ponguleti Sensational Comments :రూ. 70 కోట్ల కాంట్రాక్టు కోసం కక్కుర్తి పడేటోన్ని కాను
