Minister Ponguleti Sensational Comments :రూ. 70 కోట్ల కాంట్రాక్టు కోసం క‌క్కుర్తి ప‌డేటోన్ని కాను

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి శ్రీ‌నివాస్ రెడ్డి

Hello Telugu - Minister Ponguleti Sensational Comments

Hello Telugu - Minister Ponguleti Sensational Comments

Minister Ponguleti : హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌మ్మ‌క్క సార‌క్క టెండ‌ర్ల విష‌యంలో త‌న‌కు, మంత్రి కొండా సురేఖ‌కు మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయంటూ పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) అంటే ఏంటో అందరికీ తెలుసు అన్నారు. రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయ పడే అంత అవసరం త‌న‌కు లేద‌న్నారు. త‌న వ‌ద్దే వేల కోట్ల రూపాయ‌లు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రూ .211 కోట్ల నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. నా మీద సహచర మంత్రులు ఎవ‌రూ ఫిర్యాదు చేశార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని చెప్పారు శ్రీ‌నివాస్ రెడ్డి.

Minister Ponguleti Srinivas Reddy Shocking Comments

త‌న జీవితం తెరిచిన పుస్త‌కం అని స్ప‌ష్టం చేశారు. కావాల‌ని త‌న‌ను డ్యామేజ్ చేసేందుకు దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. అస‌లు త‌న మీద ఫిర్యాదు చేసేందుకు ఏమీ లేద‌న్నారు. సీతక్క, సురేఖ ఇద్దరు మంత్రులు సమ్మక్క సారక్క లాగా ప‌ని చేస్తున్నారంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. భక్తుల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునీకరణ పనులు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.
90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రాతి కట్టడాలకు కావల్సిన గ్రానైట్ పొరుగు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నామ‌ని చెప్పారు. శాశ్వత ప్రతిపాదకన పనులు చేస్తున్నామ‌ని అన్నారు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగకుండా నిర్మాణాలు చేపట్టనున్న‌ట్లు చెప్పారు.

Also Read : GHMC Commissioner Shocking Comments : ఓట్ చోరీ బాగోతంపై విచార‌ణ‌కు ఆదేశం

Exit mobile version