YS Jagan : అమరావతి – మాజీ సీఎం జగన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఏ ఒక్కరు బతికే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందన్నారు. ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు నమోదు చేసినా, జైలుపాలు చేసినా భయపడేది లేదన్నారు . అసలు నా పర్యటనలకే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రశ్నించారు. గురువారం జైలు నుండి విడుదలైన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
YS Jagan Slams NDA Govt
అనంతరం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మీడియాతో మాట్లడారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రత్యేకించి కూటమి సర్కార్ కావాలని తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయినా భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన నేతలను కలవడం కూడా నేరమేనా అని ఫైర్ అయ్యారు. తనను అభిమానించే వాళ్లు నా కార్యక్రమాలకు వస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు.
తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేట్రేగి పోతున్నారని మండిపడ్డారు. అయినా చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం.
Also Read : Minister Savitha Shocking Comments : తెలుగుదేశం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ – సవిత
