YS Jagan : తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఇప్పటికే రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందిస్తుండగా… తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.
YS Jagan Shocking Comments
ఫోన్ ట్యాపింగ్ జరిగినదే నిజమని స్పష్టం చేసిన షర్మిల (YS Jagan) … ఈ వ్యవహారంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఇద్దరూ కలిసి పనిచేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఫోన్‌తో పాటు తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని బహిరంగంగా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.
ఈ ఆరోపణలపై గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR) అధినేత వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాపింగ్‌పై తనకు స్పష్టమైన సమాచారం లేదని, తాను అలాంటిది చేసినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పారు. గతంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని గుర్తుచేసిన జగన్, ఆమెపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదీ తనకు తెలియదని, తెలంగాణ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇక ఇదంతా అన్నా-చెల్లెల్ల మధ్య వివాదంగా కనిపించినా, ఇది పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశమే అయినప్పటికీ అవసరమైతే విచారణకు సిద్దమని ఏపీ మంత్రులు తెలిపారు. అవసరమనిపిస్తే అధికార యంత్రాంగం ద్వారా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అనేక కుట్రలు జరిగాయనీ, వాటన్నింటినీ త్వరలో బయటపెడతామని మంత్రులు హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో వేడెక్కిన అంశంగా మారింది. షర్మిల ఆరోపణలతో ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ వివాదం కేంద్ర బిందువుగా మారింది. ఇక జగన్ స్పందనతో పాటు ఏపీ మంత్రుల వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఊపందిస్తున్నాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ ఈ అంశం ఎలా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : Minister Nara Lokesh Exclusive : బ్రిటన్ మాజీ ప్రధాని ‘టోనీ బ్లెయిర్’ తో భేటీ అయిన ఏపీ ఐటీ మినిస్టర్
