Krishna Water – YS Jagan Shocking Comments : కృష్ణా జ‌లాల వినియోగంపై జ‌గ‌న్ కామెంట్స్

763 టీఎంసీలు ఇవ్వాలంటున్న తెలంగాణ

Hello Telugu - Krishna Water - YS Jagan Shocking Comments

Hello Telugu - Krishna Water - YS Jagan Shocking Comments

YS Jagan : అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు కృష్ణా జ‌లాల వినియోగానికి సంబంధించి. కృష్ణా వాట‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ట్రిబ్యూన‌ల్ -2 ముందు జ‌ర‌గ‌బోయే విచ‌చార‌ణ‌లో ఏపీ స‌ర్కార్ త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించాల‌ని కోరారు. శుక్ర‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా కృష్ణా నదిలో 763 టీఎంసీల నీటిని కేటాయించాల‌ని తెలంగాణ స‌ర్కార్ కోరుతోంద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో కృష్ణా ట్రిబ్యున‌ల్ ఈ అభ్య‌ర్థ‌న‌ను అంగీక‌రిస్తే ఏపీ రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గుర‌వుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు జ‌గ‌న్ రెడ్డి.

YS Jagan Shocking Comments on Krishna Water

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు KWDT-II ముందు తన తుది వాదనలను సమర్పించాల‌ని, అన్యాయమైన పునర్విభజనను నిరోధించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల టీడీపీ నిర్లక్ష్య వైఖరిని కూడా తాను గ‌తంలో ప‌లుమార్లు ఎత్తి చూపాన‌ని అన్నారు. 1996లో నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా కూడా ఉన్నార‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519.6 మీటర్ల నుండి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. ఆ సమయంలో, ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా రైతులు ఈ పరిణామం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కులను తీవ్రంగా దెబ్బ తీస్తుందని న్యాయంగా ఆందోళన చెందారు.

అయినా ఆనాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ప‌ట్టించు కోలేద‌ని జ‌గ‌న్ రెడ్డి ఆవేద‌న చెందారు. టీడీపీ ప్రభుత్వ నిజాయితీ లేని వైఖరి కారణంగానే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకకు ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచడానికి అనుమతి ఇచ్చిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా, 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు వదులుకుందని తెలిపారు .మళ్ళీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని ఆవేద‌న చెందారు.

Also Read : CM Chandrababu Strong Focus : కుప్పంలో సంజీవిని ప్రాజెక్టు అమ‌లు

Exit mobile version