Vinayaka Chavithi – YS Jagan Interesting : గ‌ణేశుడికి పూజ‌లు చేసిన మాజీ సీఎం జ‌గ‌న్

ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు

Hello Telugu - Vinayaka Chavithi - YS Jagan Interesting

Hello Telugu - Vinayaka Chavithi - YS Jagan Interesting

YS Jagan : అమ‌రావ‌తి – వినాయక చవితి పండుగ సందర్భంగా బుధ‌వారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గణనాధుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి (YS Jagan).
వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

YS Jagan in Vinayaka Chavithi Celebrations

వైయస్‌ జగన్‌ షెడ్యూల్‌ ప్రకారం.. బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయింది. దీంతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పూజ కార్య‌క్ర‌మంలో ఆయన పాల్గొన్నారు.

ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, కల్పలత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, నందిగం సురేష్‌, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఆలూరి సాంబ శివారెడ్డి, పోతిన వెంకట మహేష్‌, దొంతిరెడ్డి వేమారెడ్డి, రాయన భాగ్యలక్ష్మి, అడపా శేషు, కొమ్మూరి కనకారావు, నారాయణమూర్తి, తంగిరాల రామిరెడ్డి సహా పార్టీ నేతలు హాజరయ్యారు.

ఈ సంద‌ర్బంగా వినాయ‌క చ‌వితి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని అటు ఆంద్ర‌ప్ర‌దేశ్ ఇటు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అన్ని ప‌నులు, కార్య‌క్ర‌మాలు శుభ‌ప్ర‌దంగా అయ్యేలా చూడాల‌ని వినాయ‌కుడిని కోరుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆయురారోగ్యంతో, సుఖ సంతోషాల‌తో విల‌సిల్లేలా దీవించాల‌ని ఆ గ‌ణేశుడిని ప్రార్థించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

Also Read :  Trump New Tarrifs Shocking : భారత్ పై మొదలైన ట్రంప్ కొత్త సుంకాలు

Exit mobile version