Trump New Tarrifs Shocking : భారత్ పై మొదలైన ట్రంప్ కొత్త సుంకాలు

చమురు కొనుగోళ్లు కొనసాగుతున్నాయన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు...

Hello Telugu - Trump New Tarrifs Shocking

Hello Telugu - Trump New Tarrifs Shocking

Trump : భారతదేశంపై అమెరికా విధించిన అదనపు 25 శాతం సుంకం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో భారత్‌పై మొత్తం సుంకాల భారం 50 శాతంకి చేరింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగుతున్నాయన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Trump – ప్రభావితమయ్యే ఉత్పత్తులు

నిపుణుల అంచనా ప్రకారం, కొత్త సుంకాల ప్రభావం వల్ల భారతదేశపు $48.2 బిలియన్ల ఎగుమతులు నష్టపోవచ్చు. దీని ఫలితంగా దేశ GDP 0.3% నుండి 0.8% వరకు తగ్గే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రధానంగా ప్రభావితమయ్యే రంగాలు:

అయితే, మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులపై ఈ కొత్త సుంకాలు ప్రభావం చూపవు.

భారత్‌కు నష్టం – ఇతర దేశాలకు లాభం

ఈ పరిణామం వల్ల భారత ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో పోటీ చేయడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, బంగ్లాదేశ్, కంబోడియా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు తక్కువ సుంకాలు ఉండటంతో వాటికి అదనపు అవకాశాలు లభించే అవకాశముంది.

Also Read : Donald Trump Shocking Comments : నా వ‌ల్ల‌నే పాకిస్తాన్, ఇండియా యుద్దం ఆగింది

Exit mobile version