YS Jagan : అమరావతి – మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పై భగ్గుమన్నారు. రోజు రోజుకు తమ పార్టీకి చెందిన నేతలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు కొందరు అధికార పార్టీకి కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని మండిపడ్డారు. తన పర్యటన సమయంలో కూడా ఓవర్ యాక్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లెలో రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైసీపీ వేమూరు నియోజకవర్గ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబుపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
YS Jagan Slams Police
ఈ సందర్బంగా సంఘటన జరిగిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీకి చెందిన నేత వరికూటి అశోక్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో సాగునీటి కాలువలు గుర్రపు డెక్కతో నిండిపోయి పంటపొలాలకు నీరు రాక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి పక్షాన తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామని ఈ సందర్బంగా జగన్ రెడ్డికి తెలిపారు అశోక్ బాబు. ఇదిలా ఉండగా తీవ్రంగా గాయపడడంతో వెంటనే తనను రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వేలాది మంది రైతుల తరుపున పోరాడుతూ, వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్‌బాబు చేస్తున్న ప్రయత్నాన్ని అణిచి వేయాలని చూడడం దారుణమన్నారు.
తన ఆరోగ్య వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, అశోక్‌బాబుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు పార్టీ నుంచి అందుతాయని వైయస్ జగన్ భరోసానిచ్చారు.
Also Read : Mexico Massive Earthquake Sensational : మెక్సికోలో భారీ భూకంపం ప్రాణ, ఆస్తి నష్టం
















