YS Jagan Shocking Comments : ఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లు విఫ‌లం

మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

Hello Telugu - YS Jagan Shocking Comments

Hello Telugu - YS Jagan Shocking Comments

YS Jagan : అమ‌రావ‌తి – ఏపీలో శాంతి భద్రతలు లేవ‌న్నారు మాజీ సీఎం జ‌గ‌న్ (YS Jagan) . నిన్న జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణ అన్నారు. వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారంటూ ప్ర‌శ్నించారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లలో కూర్చోనీయలేదని ఆరోపించారు. 15 పోలింగ్‌ బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేద‌న్నారు. బుధ‌వారం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

YS Jagan Shocking Comments on AP Govt

బందిపోటు దొంగల తరహాలో చంద్రబాబు ఎన్నిక జరిపించారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పులివెందుల ZPTC ఉప ఎన్నిక కోసం చంద్రబాబు కుట్రలకు పాల్పడ్డారని మండిప‌డ్డారు. పోలింగ్‌ బూత్‌లను మార్చేశారని అన్నారు. చంద్రబాబుది అడ్డగోలు రాజకీయం అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంబల్‌వ్యాలీలో బందిపోట్లను కూడా మరిపించార‌ని ఫైర్ అయ్యారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. బందిపోట్ల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు .

పులివెందుల అభ్యర్థి హేమంత్‌రెడ్డిని ఇంటినుంచి బయటకు రానీయ లేద‌ని వాపోయారు. డీఐజీ కోయ ప్రవీణ్‌ పర్యవేక్షణలో ఉప ఎన్నికలు జరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో మాట వినని పోలీసు అధికారులపై కేసులు పెడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో మంది అధికారులను వేధించారు, సస్పెండ్‌ చేశారని అన్నారు. కొంత మంది పోలీసు అధికారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ZPTC ఉప ఎన్నిక కోసం పోలీసులను ఏరికోరి నియమించు కోవ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : Minister Atchannaidu Alarming : రొయ్య‌ల రైతుల‌కు స‌ర్కార్ స‌పోర్ట్

Exit mobile version