YS Jagan : అమరావతి : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సంచలన ఆరోపణలు చేశారు ఏపీ కూటమి సర్కార్ పై. కృత్రిమ యూరియా కొరత రూ.250 కోట్ల కుంభకోణంగా మారిందన్నారు. రాష్ట్రంలో రైతులు తమ ఉత్పత్తులకు తగిన మద్దతు ధరలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది వారిని ఆత్మహత్యకు దారితీసిందని జగన్ అన్నారు. వైసీపీ అన్నదాత పోరు బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా. రైతులకు కావాల్సిన యూరియా అందడం లేదన్నారు . యూరియాను సరైన సమయానికి అందించడంలో సీఎం చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని పేర్కొన్నారు.
YS Jagan Slams AP Govt
బుధవారం ఎరువుల కృత్రిమ కొరత వల్ల రూ.200 నుంచి రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తన పార్టీ నిర్వహించిన నిరసనల్లో పాల్గొంటే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో రైతులు తమ ఉత్పత్తులకు తగిన మద్దతు ధరలు అందడం లేదని వాపోయారు. ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారని, కొరత ఏర్పడుతుందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. సీఎం ప్రోత్సాహం కారణంగా యూరియా అక్రమదారులలో వెళుతోందని జగన్ రెడ్డి ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ రైతులు రోడ్డెక్కిన దాఖలాలు లేవన్నారు. ఆర్బీసీ సెంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు అన్నదాతలకు అండగా ఉంటూ వచ్చామన్నారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక రైతులు బయటకు రావడం మొదలైందన్నారు. అయినా సోయి లేకుండా తమపై నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : JCHSL Clear Letter : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి : గోపరాజు

















