YS Jagan : విశాఖపట్నం : అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడు కునేందుకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan). విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడటమే పార్టీ ఏకైక లక్ష్యం అని అన్నారు. ఈ సందర్బంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు భరోసా ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. తాను మీ వెంట ఉంటానని ప్రకటించారు. నర్సీపట్నం, విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఉద్యోగులు తనను సంప్రదించినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడటానికి తన నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ఉద్యోగులు తమ ఆందోళనలను వివరిస్తూ ఒక పిటిషన్‌ను సమర్పించారు.
Ex CM YS Jagan Slams AP Govt
స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని ఎన్నికల హామీ ఇచ్చినప్పటికీ, టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను మోసం చేసిందని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ మనుగడను కాపాడుకునేందుకు తమకు మద్దతు ఇవ్వాలని జగన్ రెడ్డిని కోరారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు జగన్ రెడ్డి. పవర్ లో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా, తన వైఖరి అలాగే ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ ఎల్లప్పుడూ స్టీల్ ప్లాంట్‌ను కాపాడటానికి పోరాడుతుందని ప్రకటించారు. ప్రైవేటీకరణను నిరోధించడం, కార్మికుల పోరాటంలో వారికి అండగా నిలబడటం పార్టీ ధ్యేయమని ఆయన నొక్కి చెప్పారు.
Also Read : MP R Krishnaiah Fired on Congress Govt : సర్కార్ నిర్వాకం బీసీలకు అన్యాయం

















