YS Jagan Anakapalli Tour Important Update : జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు కండీష‌న్స్ అప్లై

స్ప‌ష్టం చేసిన అన‌కాప‌ల్లి జిల్లా ఎస్పీ

Hello Telugu - YS Jagan Anakapalli Tour Important Update

Hello Telugu - YS Jagan Anakapalli Tour Important Update

YS Jagan : అమ‌రావ‌తి : వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన‌కాప‌ల్లి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు ఎట్ట‌కేల‌కు అనుమ‌తి ల‌భించింది. తాను ఈనెల 9వ తేదీన అన‌కాప‌ల్లెలో ప‌ర్య‌టించాల్సి ఉంద‌ని, త‌క్ష‌ణ‌మే త‌న‌కు పోలీసుల నుంచి ప‌ర్మిష‌న్ కావాల‌ని కోరారు. దీనిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు పోలీసులు. ఎట్ట‌కేల‌కు జగన్ కు హెలికాప్టర్ ద్వారా అనకాపల్లె చేరుకోవడానికి అనుమతి మంజూరు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా అనకాపల్లె జిల్లాలోని మాకవరపాలెం లో ప‌ర్య‌టించాల్సి ఉంది. త‌న పర్యటన దృష్ట్యా విశాఖపట్నం నుండి మాకవరపాలెంకు హెలికాప్టర్ ద్వారా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా తెలిపారు.

YS Jagan Anakapalli Tour Updates

మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్ (YS Jagan) పర్యటన కోసం విశాఖపట్నం విమానాశ్రయం నుండి మాకవరపాలెం వరకు 63 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి దరఖాస్తు చేసుకున్న‌ట్లు చెప్పారు. జాతీయ రహదారిపై ముఖ్యమైన కూడళ్లలో ర్యాలీ, నిరసన నిర్వహించనున్నట్లు సమాచారం త‌మ‌కు అందింద‌న్నారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు ఎస్పీ. ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ ర్యాలీ సంద‌ర్బంగా తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘ‌ట‌న‌లో 41 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్నారు.

Also Read : MLA Harish Rao Strong Demand : వైద్య సిబ్బందికి వెంట‌నే వేత‌నాలు చెల్లించాలి

Exit mobile version