Moong Dal : మన వంటింట్లో సాధారణంగా లభించే పెసరపప్పు కేవలం రుచికోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఖనిజాలు, విటమిన్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా పలు వ్యాధుల నివారణలో సహాయపడతాయి.
Moong Dal – రక్తపోటు నియంత్రణలో సహాయకారి
పెసరపప్పులో (Moong Dal) మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తనాళాల పనితీరును మెరుగుపరచి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ఆహారంలో పెసరపప్పును చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జీర్ణక్రియకు మేలు
పెసరపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలను తగ్గించడంలో సహకరిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ శక్తి మెరుగుపడుతుంది.
ఎముకల ఆరోగ్యం
కాల్షియం అధికంగా ఉండే పెసరపప్పు ఎముకలను బలపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎముకల బలహీనత లేదా పగుళ్ల సమస్యలు ఉన్నవారు దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మేలు పొందవచ్చు.
కంటి సంరక్షణ
విటమిన్ C, B5, B6 లాంటి ముఖ్యమైన పోషకాలు పెసరపప్పులో లభిస్తాయి. వీటి వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా విటమిన్ C రెటీనాను రక్షించి చూపును కాపాడడంలో సహకరిస్తుంది.
చర్మం, జుట్టుకు లాభదాయకం
పెసరపప్పు వినియోగం చర్మానికి సహజ కాంతిని అందిస్తుంది. ముడతలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఇందులో ఉండే రాగి (Copper) జుట్టు మూలాలను బలపరుస్తుంది. పెసరపప్పును ఆహారంతో పాటు హెయిర్ మాస్క్ రూపంలో వాడితే జుట్టు మందంగా, పొడవుగా, మెరిసేలా మారుతుంది.
Also Read : Heart Attack Prevention : గుండెపోటు నివారణకు మరో కొత్త మందు
