విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిప్పులు చెరిగారు. వైసీపీ బాస్ , మాజీ సీఎం జగన్ రెడ్డిని, వైసీపీ నేతలను ఏకి పారేశారు. వారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. పరిటాల రవి సహా అనేక మందిని హత్య చేయించిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డిదని, ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. సొంత బాబాయిని హత్య చేయించింది నువ్వు కాదా జగన్ అని ప్రశ్నించారు బుచ్చయ్య చౌదరి. నరకుతా నరకుతా అని అంటున్నారు మేం నరకలేమా? అని నిలదీశారు. రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను చులకనగా చూడటం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు ఎమ్మెల్యే.
పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే గుమ్మం దాటి బయటకు కూడా రాలేరని హెచ్చరించారు టీడీపీ ఎమ్మెల్యే. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్నారు. ఇదే సమయంలో పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బిల్లులు వీగి పోవడం పట్ల మండిపడ్డారు. ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా బిల్లు అడ్డుకోవడం దారుణమన్నారు. చిన్న కాంప్లికేషన్స్ వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా 33% రిజర్వేషన్ మహిళలకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు ఎమ్మెలయే బుచ్చయ్య చౌదరి.
















