Yarlagadda Lakshmi Prasad : అమరావతి – ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, విద్యా వేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు అరుదైన గౌరవం లభించింది. ఈ మేరకు కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం లో పునః రూపకల్పన చేసిన సంయుక్త హిందీ సలహా సమితిలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (Yarlagadda Lakshmi Prasad) ను సభ్యునిగా నియమించింది. బుధవారం ఈ మేరకు కీలక అధికారిక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
Yarlagadda Lakshmi Prasad As a
ఈ కమిటీకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఛైర్మన్‌గా, సహాయ ఆర్థిక మంత్రి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. విభిన్న కేంద్ర శాఖలైన రెవెన్యూ, వ్యయము, పెట్టుబడి, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయాల పరిపాలనలో హిందీ భాషా వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు, భాషా నిపుణులు, హిందీ ప్రచార సంస్థల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇందులో భాగంగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు అవకాశం లభించింది. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ యార్లగడ్డ హిందీతో పాటు తెలుగు భాషా అభివృద్ధికి విశేష సేవలు అందించారు. ఈ నూతన బాధ్యత ద్వారా కేంద్ర పరిపాలన వ్యవస్థలో హిందీ అభివృద్ధికి కృషి చేస్తానని యార్లగడ్డ స్పష్టం చేశారు.
Also Read : CS Rangarajan – Bhadrachalam EO Attack : భద్రాచలం ఈవోపై దాడి దారుణం – రంగరాజన్
