CS Rangarajan : హైదరాబాద్ – ప్రముఖ భద్రాచలం ఆలయ కార్య నిర్వహణ అధికారి రమాదేవిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం పట్ల స్పందించారు రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్ (CS Rangarajan). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా యాటపాక మండలం పురుషోత్తపట్నంలో శ్రీ భద్రాచల రాముల వారికి చెందిన భూములలో అక్రమ నిర్మాణాలను ప్రశ్నించినందుకు ఈవోపై దారుణంగా దాడికి దిగడం తనను మరింత బాధకు గురి చేసిందన్నారు. ఈ మధ్య కాలంలో ఆక్రమణదారుల కళ్లు దేవాలయ భూములపై, మాన్యాలపై పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
CS Rangarajan Comments
చిల్కూరులో తాము కూడా గత కొన్నేళ్ల నుంచి ఆలయ పరిరక్షణ హక్కుల కోసం గత కొన్నేళ్లుగా పోరాడుతూ వస్తున్నామని తెలిపారు సీఎస్ రంగరాజన్. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సీతా రామచంద్ర స్వామికి చెందిన భూములను కాపాడక పోవడం దారుణమన్నారు. శ్రీ భద్రాచల రాముల వారికి చెందిన భూములు తెలుగు రాష్ట్రాలలోని కోట్లాది మంది భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ భూములను ఆక్రమణల నుండి రక్షించడానికి ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నప్పుడు, వారిపై దాడి చేయడం, బెదిరింపులకు దిగడం అప్రజాస్వామికమని అన్నారు సీఎస్ రంగరాజన్.
Also Read : Minister Ram Prasad Shocking : పర్యటనల పేరుతో జగన్ చిల్లర రాజకీయం
