CEO Linda : అమెరికా – టెస్లా, స్టార్ లింక్, ఎక్స్ సంస్థల చైర్మన్ , టాప్ బిలియనీర్ గా గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్ కు కోలుకోలేని షాక్ తగిలింది. తను ప్రాణప్రదంగా టేకోవర్ చేసుకున్న ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్) ను టాప్ లో నిలిపేందుకు శతవిధాలుగా కృషి చేస్తూ వచ్చిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లిండా యాకారినో ఉన్నట్టుండి సంచలన ప్రకటన చేశారు. తాను సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఎందుకు వైదొలుగుతున్నాననే విషయంపై మాత్రం వివరణ ఇవ్వలేదు.
X CEO Linda Resigned
ఈ సందర్బంగా లిండా యాకారినో (CEO Linda) కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంత కాలం ఎక్స్ బృందంతో కలిసి పని చేసినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. ఇలాంటి క్షణాలు జీవితాంతం గుర్తుండి పోతాయని స్పష్టం చేసింది. తనకు అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు తాను ఎల్లవేళలా ఎక్స్ చైర్మన్ ఎలాన్ మస్క్ కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపింది. రెండు సంవత్సరాల పాటు సంస్థలో పని చేయడం పట్ల తాను పూర్తిగా సంతృప్తితో ఉన్నానని పేర్కొంది లిండా యాకారినో.
ఇదిలా ఉండగా ఎక్స్ లో సీఈవోగా పని చేయక ముందు తను ఎన్బీసీ యూనివర్శల్ ప్రకటన వ్యాపారం నిర్వహించారు. స్వేచ్ఛకు ప్రయారిటీ ఇచ్చే ఎక్స్ ను ప్రతిదీ యాప్ గా మార్చే బాధ్యతను తనపై ఉంచినందుకు, ఇంతకాలం తనకు బాధ్యతలు అప్పగించినందుకు మస్క్ కు రుణపడి ఉన్నానని తెలిపింది. X బృందం గురించి నేను చాలా గర్వపడుతున్నానని, తాము కలిసి సాధించిన చారిత్రాత్మక గొప్ప మలుపు ఇది అని లిండా యాకారినో వెల్లడించింది.
Also Read : KCR Sensational Comments : బనకచర్ల ప్రాజెక్టుపై కేసీఆర్ ఆందోళన



















