World Population Day : హైదరాబాద్ – ప్రపంచ అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. 1987లో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. ఈ సందర్బంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కుటుంబ నియంత్రణ పాటించాలని, లింగ సమానత్వం, పేదరికం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కులు, తదితర అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. జనాభా సమస్యల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తుంది. 1989లో ఐక్య రాజ్య సమితి అభివృద్ది కార్యక్రమంలో భాగంగా ఉంది. 1990 డిసెంబరు నాటి 45/216 తీర్మానం ద్వారా పర్యావరణం, అభివృద్ధికి సంబంధాలతో సహా జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది.
World Population Day Today
తొలిసారిగా 90 దేశాలలో వరల్డ్ పాపులేషన్ డేను నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో నిర్వహిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ జనాభా విభాగం జనాభాపై పని కార్యక్రమాన్ని అమలు చేయడంలో జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సును అనుసరించడంలో ఐక్యరాజ్యసమితి వ్యవస్థ ఏజెన్సీలు, నిధులు, కార్యక్రమాలు సంస్థలతో సన్నిహితంగా సహకరిస్తుంది. ఐక్యరాజ్యసమితి మిషన్లు, జాతీయ ప్రభుత్వ కార్యాలయాలు, ఐక్యరాజ్యసమితి కార్యాలయాలు, పరిశోధకులు, మీడియా ప్రతినిధులు జనాభా అభివృద్ధి సమస్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. భారత దేశంలో కూడా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ నియంత్రణ పాటించాలని, తోటి ప్రజలను ప్రేమించాలని పిలుపునిచ్చారు.
Also Read : Today Gold Price : పసిడి ప్రియులకు మరో షాక్..మల్లి పెరిగిన బంగారం ధరలు
