Gold : దేశంలో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలకు పెద్ద షాకే తగులుతోంది. ఒక్క రోజు తగ్గితే మూడు రోజులు పెరుగుతుండటంతో పేద మరియు మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయి.
గత నెలలో రూ.94,000 వద్ద ట్రేడైన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (Gold) ధర ప్రస్తుతం రూ.98,000కి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్ ధర కూడా $3,300 పైన కొనసాగుతోంది. ఏడాదిలో బంగారం ధరలు సుమారు 37.63 శాతం పెరిగినట్టు గణాంకాలు చూపిస్తున్నాయి. గత 28 రోజుల వ్యవధిలో 70 శాతం పెరుగుదల చోటుచేసుకుంది.
Gold – హైదరాబాద్ మార్కెట్ ధరలు:
హైదరాబాద్ నగరంలో బంగారం ధరల్లో మరోసారి పెరుగుదల కనిపించింది.
24 క్యారెట్ల (10 గ్రాములు): ₹98,410
22 క్యారెట్ల (10 గ్రాములు): ₹90,210
18 క్యారెట్ల (10 గ్రాములు): ₹73,810
నిన్నటి ధరలతో పోలిస్తే గ్రాముకు ₹1 చొప్పున రూ.10 పెరిగింది.
ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు – 10 గ్రాములకు):
విజయవాడ: ₹98,400
రాజమండ్రి: ₹98,400
విశాఖపట్నం: ₹98,336
చెన్నై: ₹98,400
ముంబై: ₹98,400
బెంగళూరు: ₹98,400
కోల్‌కతా: ₹98,400
కేరళ: ₹98,400
పుణె: ₹98,400
అహ్మదాబాద్: ₹98,450
న్యూఢిల్లీ: ₹98,550
వెండి ధరల్లో తగ్గుదల:
ఇక వెండి ధరలు మాత్రం కొంత ఊరటనిచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 100 గ్రాముల వెండి నిన్న ₹12,000 వద్ద ట్రేడ్ కాగా, ఈ రోజు ₹11,990కి తగ్గింది. కిలో వెండి ధర రూ.1,20,000 నుంచి రూ.1,19,900కి పడిపోయింది. అంటే 100 గ్రాములకు ₹10, కిలో వెండికి ₹100 తగ్గుదల నమోదైంది.
పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ముందుండగా బంగారం ధరలు ఇలా పెరగడం వినియోగదారులపై భారాన్ని మోపుతోంది. అయితే, వెండి ధరల తగ్గుదల కొంత ఊరట కలిగించిందన్నది సత్యం.
Also Read : Today Gold Price : స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు
