మ‌హిళా క్రికెట్ కు మంచి భ‌విష్య‌త్తు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మిథాలీ రాజ్

hellotelugu-MithaliRaj

ముంబై : భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ చ‌ర్చా వేదిక‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టారు. గ‌తంలో మ‌హిళా క్రికెట్ కు అంతగా ఆస‌క్తి చూపించే వారు కాద‌న్నారు. కానీ తాము ఆడ‌టం ప్రారంభించ‌డం జ‌రిగిందో ఆనాటి నుంచి నేటి దాకా పెద్ద ఎత్తున మ‌హిళా యువ‌త ఆస‌క్తి చూపిస్తున్నార‌ని అన్నారు. మ‌రో వైపు బీసీసీఐ కూడా పూర్తి మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని , ఇది మంచి శుభ ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు మిథాలీ రాజ్. తాజాగా ముంబై వేదిక‌గా జ‌రిగిన ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మహిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2025ను 25 ఏళ్ల త‌ర్వాత హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును ఓడించి విశ్వ విజేత‌గా నిలిచింద‌న్నారు.

ఈ ఒక్క విజ‌యం దేశ వ్యాప్తంగా మ‌హిళా క్రికెట‌ర్ల ప‌ట్ల ఉత్సుక‌త పెంచేలా చేసింద‌ని చెప్పారు మిథాలీ రాజ్. రాబోయే రోజుల్లో చాలా మంది యువ‌త ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు ముందుకు వ‌స్తార‌ని, వ‌స్తున్నార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇండియా మ‌హిళా క్రికెట్ కు ఆద‌ర‌ణ ఉంటుంద‌న్నారు. భారీ ఎత్తున ఫీజులు కూడా ఇస్తున్న‌ట్లు తెలిపారు. తాము ఆడిన స‌మ‌యంలో ఇంత‌గా ఆద‌ర‌ణ లేద‌న్నారు. త‌మ‌కు స్పాన్స‌ర్స్ కూడా వ‌చ్చేవారు కాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మిథాలీ రాజ్. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు సైతం మ‌హిళా టోర్నీల‌కు కూడా స‌పోర్ట్ చేస్తున్న‌ట్లు ఆనందంగా ఉంద‌న్నారు.

Exit mobile version