అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు. ఆతిథ్య భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది. ఎలాంటి అంచనాలు లేకుండానే కీవీస్ బరిలోకి దిగింది. ఊహించని రీతిలో ఫైనల్ కు చేరుకుంది. ఆ జట్టు బలమైన హాట్ ఫెవరేట్ గా భావించిన సౌతాఫ్రికాకు చుక్కలు చూపించింది. 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక టీం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా టోర్నీలో దిగినా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది క్వార్టర్, సెమీ ఫైనల్ మ్యాచ్ లు. సౌతాఫ్రికా చేతిలో దారుణంగా ఓడి పోయింది. ఆ తర్వాత తేరుకుంది టీమిండియా.
ఈ తరుణంలో భారత జట్టును ఫైనల్ దాకా తీసుకు వెళ్లడంలో కీలకమైన పాత్ర పోషించాడు నిన్నటి దాకా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను కేవలం ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. కానీ 207 స్ట్రైక్ రేటుతో దుమ్ము రేపాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నామినేషన్స్ లలో తను కూడా ఎంపికయ్యాడు. ఇప్పుడు అందరి కళ్లు తనపైనే ఉన్నాయి . ఫైనల్ లో ఇదే జోరు కొనసాగిస్తే కప్ ఇండియాకేనని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. తను విండీస్ తో 97 రన్స్ చేయగా ఇంగ్లండ్ తో 89 కీలకమైన పరుగులతో సత్తా చాటాడు.
