13న నెట్ ఫ్లిక్స్ లో ర‌ణ‌బాలి స్ట్రీమింగ్..?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న

helloteluugu-RanabaaliOTT

హైద‌రాబాద్ : రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన పీరియాడిక్ డ్రామా చిత్రం ర‌ణ‌బాలి. ఈ సినిమా అక్టోబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది, అయితే ఆ పోస్ట్‌ను తర్వాత తొలగించింది. ఈ చిత్రం నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం సహా పలు భాషల్లో అందుబాటులో ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా సంస్థ ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీని పేర్కొంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అయితే ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించారు. కొందరు ప్రేక్షకులు ఈ ప్రకటనను గమనించి అది తొలగించబడ కముందే స్క్రీన్‌షాట్‌లను భద్రపరిచారు. ఆ పోస్ట్ ఆధారంగా ఈ చిత్రం నవంబర్ 13న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లేదా చిత్ర నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘రణబాలి’ అనేది బ్రిటిష్ పాలన కాలం నాటి నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, బ్రిటిష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయికగా నటించారు. వీరిద్దరూ మళ్లీ కలిసి నటిస్తుండటం సినీ అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నలతో పాటు ఆర్నాల్డ్ వోస్లో, ఈశ్వరీ రావు, లాల్, వినోద్ సాగర్ , కిషోర్ కుమార్ పోలిమెర ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version