నా విజ‌యానికి కార‌ణం నా భార్య జ్యోతిక : సూర్య

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ అగ్ర న‌టుడు

hellotelugu-SuriyaJyothika

చెన్నై : త‌మిళ సినీ రంగానికి చెందిన అగ్ర న‌టుడు సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను కూల్ గా ఉండేందుకు , స‌క్సెస్ సాధించ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం అంటూ ఏమీ లేద‌ని, కానీ ఒకే ఒక్క‌రు మాత్రం ఉన్నారంటూ పేర్కొన్నారు. త‌ను ఎవ‌రో కాదా త‌ను ప్రాణ ప్ర‌దంగా ప్రేమించే జ్యోతిక అని వెల్ల‌డించారు. తన భార్య, నటి జ్యోతిక పట్ల తనకున్న ప్రేమను, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. చెన్నైలో జరిగిన తన రాబోయే చిత్రం ‘సీన్’ ఆడియో లాంచ్ కార్యక్రమంలో తన వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితంలో జ్యోతిక పోషించిన కీలక పాత్ర గురించి ఆయన మాట్లాడారు. వారిద్దరి బంధంపై ఆయన వ్యక్తం చేసిన హృదయ పూర్వక మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటలలో సూర్య , జ్యోతిక ఒకరు. ఈ దంపతులు ఇటీవల తమ వివాహ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తమ బంధం గురించి మాట్లాడుతూ తమది పరిపూర్ణమైన వివాహ జీవితం కాదని, పరస్పర అవగాహన , మద్దతుతో సాగుతున్న ఒక అందమైన ప్రయాణమని జ్యోతిక పేర్కొన్నారు. జ్యోతిక తన జీవిత భాగస్వామిగా లభించడం తన అదృష్టమని సూర్య పలు సందర్భాల్లో చెప్పారు కూడా. ‘సీన్’ చిత్ర ఆడియో లాంచ్ వేదికపై, తన జీవితంపై జ్యోతిక ప్రభావం ఎలా ఉందో సూర్య బహిరంగంగా పంచుకున్నారు. తాను నేడు ఈ స్థితికి చేరుకోవడానికి సరైన మార్గంలో పయనించడానికి ఆమెనే ప్రధాన కారణమని చెప్పారు.

జీవితంలో తాను కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ, జ్యోతిక ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచి, సరైన దిశలో నడిపించిందని సూర్య అంగీకరించారు. ఆమె ఒక అద్భుతమైన తల్లి, మంచి స్నేహితురాలు, గొప్ప జీవిత భాగస్వామి అని ఆయన కొనియాడారు. అంతేకాకుండా జ్యోతికలోని దృఢత్వాన్ని ప్రశంసిస్తూ త‌ను ఒక శక్తివంతమైన మహిళ అని కితాబు ఇచ్చారు సూర్య‌.

Exit mobile version