గేమింగ్ పరిశ్రమలోకి మహేష్ బాబు ప్రవేశం

ముంబై షాట్ గ‌న్ గేమ్స్ కంపెనీలో ఇన్వెస్ట్

hellotelugu-MaheshBabu

హైద‌రాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మ‌హేష్ బాబు గేమింగ్ ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ పెట్టారు. దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్కదిద్దు కోవాల‌నే ఆలోచ‌న త‌న‌ది. హీరోగా టాప్ లో కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే లెక్క‌కు మించి ఆస్తుల‌ను సంపాదించాల‌నేది త‌న టార్గెట్. ఇప్ప‌టికే ప‌లు వ్యాపారాల‌లో త‌ను కీల‌క‌మైన భాగ‌స్వామిగా ఉన్నాడు. తాజాగా మ‌హేష్ బాబుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. త‌ను పెట్టుబడిదారుడిగా గేమింగ్ పరిశ్రమలోకి ప్ర‌వేశించాడు . ముంబైకి చెందిన ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ షాట్‌గన్ గేమ్స్‌లో పెట్టుబడిదారుడిగా చేరారు .ఈ భాగస్వామ్యం ‘టేక్‌డౌన్ జెనిసిస్’ అనే కొత్త పీసీ, కన్సోల్ అడ్వెంచర్ గేమ్ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ గేమ్‌కు విక్కీ అరోరా దర్శకత్వం వహిస్తున్నారు .మహేష్ బాబు ఇప్పుడు సినిమాలకు అతీతంగా తన వ్యాపార ఆసక్తులను విస్తరిస్తున్నందున‌ ఈ ప్రకటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

షాట్‌గన్ గేమ్స్ సహ వ్యవస్థాపకులు జీత్ చందన్ , విదిత్ మెహతా లు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. మహేష్ బాబు తమ కంపెనీతో చేరడాన్ని ధృవీకరించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల నటుడు కూడా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు . ‘టేక్‌డౌన్ జెనిసిస్’ పీసీ , కన్సోల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఒక అడ్వెంచర్ గేమ్‌గా ప్లాన్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ గేమింగ్ ప్రేక్షకులకు ఇంటరాక్టివ్ వినోదాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’లో నటిస్తున్నారు. రాబోయే భారతీయ చిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాటిలో ఈ చిత్రం ఒకటి. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు , ప్రచార కార్యక్రమాలను చిత్ర నిర్మాతలు ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version