మంత్రుల‌కు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు..?

నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ప్ర‌వీణ్ కుమార్.

hellotelugu-RSPraveenKumar

హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు ఆర్ఎస్పీ. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను తీవ్రంగ‌గా ఎండ‌గ‌ట్టారు. ప్ర‌ధానంగా ఆయ‌న సెక్యూరిటీ పేరుతో తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇది పూర్తిగా ప‌క్ష‌పాతంతో కూడుకుని ఉన్న‌ద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. దేశంలో నక్సలిజం లేదని అందుకే బుల్లెట్‌ప్రూఫ్ కార్లను ఉపసంహరిస్తున్నామని డీజీపీ చెప్పార‌ని గుర్తు చేశారు. కర్ణాటకలో మంత్రుల వద్ద బుల్లెట్‌ప్రూఫ్ కార్లు లేవని అన్నారు ఆర్ఎస్పీ.

అలాంటప్పుడు తెలంగాణ మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ కార్లు ఎందుకు ఉన్నాయని ప్ర‌శ్నించారు డీజీపీని. దీనిపై స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త మీపై లేదా అని నిల‌దీశారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ఒక చట్టం, కాంగ్రెస్ నాయకులకు మరో చట్టం ఉంటుందా? అని భ‌గ్గుమ‌న్నారు . బుల్లెట్ ప్రూఫ్ కార్ల విష‌యం గురించి త‌ప్ప‌కుండా హైకోర్టును ఆశ్రయిస్తామ‌ని ప్ర‌క‌టించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఎందుకు క‌ల్పిస్తున్నారో, త‌మ ప‌ట్ల ఎందుకు క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది ప్ర‌శ్నిస్తామ‌న్నారు. చ‌ట్టం అంద‌రికీ స‌మాన‌మేన‌ని ఇప్ప‌టికే రాజ్యాంగం కూడా పేర్కొన్న విష‌యాన్ని గుర్తు చేశారు .

Exit mobile version