న్యూఢిల్లీ : కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌తో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారని ప్రకటించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీతా అగర్వాల్,, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన కొద్ది రోజులకే ఈ నియామకాలు జరిగాయి. సెప్టెంబర్ 28న జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కొలీజియం, హైకోర్టుల కింది ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది అని సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఒక ప్రకటనలో కొలీజియం పేర్కొంది. సిఫార్సు చేయబడిన పేర్లలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అగర్వాల్ (అలహాబాద్), ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయ , తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ( జార్ఖండ్) ఉన్నారు.
