Heart Attack Facts : చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి?

యువతలో గుండె సంబంధిత వ్యాధుల పెరుగుదలపై తీవ్ర చర్చ జరుగుతోంది...

Hello Telugu - Heart Attack Facts

Hello Telugu - Heart Attack Facts

Heart Attack : ఇటీవల ఉప్పల్‌లో బ్యాడ్మింటన్ ఆడుతున్న 24ఏళ్ల యువకుడు ఆకస్మికంగా కుప్పకూలి మరణించడంతో యువతలో గుండె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సికింద్రాబాద్‌కు చెందిన మరో యువకుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో (Heart Attack) మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో మళ్లీ మళ్లీ వెలుగులోకి వస్తుండటంతో, యువతలో గుండె సంబంధిత వ్యాధుల పెరుగుదలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Heart Attack – చిన్న వయస్సులోనే గుండె సమస్యలు ఎందుకు?

30 ఏళ్ల లోపువారు కూడా గుండెపోటుతో (Heart Attack) మృత్యువాత పడుతున్న ఘటనలు గణనీయంగా పెరిగిపోతున్నాయని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటినవారిలో కనిపించే గుండెజబ్బులు ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల వయస్సులోనే చూస్తున్నామని వారు హెచ్చరిస్తున్నారు.

కారణాలు ఇలా ఉన్నాయి:

వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు

జంక్ ఫుడ్ మరియు అధిక కొవ్వు

విషపు అలవాట్లు

వ్యాయామానికి ముందుగా పరీక్షల లేకపోవడం

హెచ్‌సీఎం వ్యాధి – క్రీడాకారుల్లో గుండె ఆగిపోవడానికి కారణం

హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి (HCM) అనే వ్యాధితో గుండె కండరాలు అసాధారణంగా వృద్ధి చెంది రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఇది తరచుగా వంశపారంపర్యంగా వస్తుంది. గుండె నిమిషానికి 200 సార్లు పైగా తడి కొట్టడం వల్ల చలనం ఆగిపోతుంది. ఇది సాధారణంగా అథ్లెట్లు, క్రీడాకారుల మధ్య కనిపిస్తుంది. స్టెరాయిడ్లు వినియోగించినా ఇలాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఇతర ప్రమాదకర పరిస్థితులు

నివారణకు చిట్కాలు

“గోల్డెన్ అవర్” ప్రాముఖ్యత

గుండెపోటు (Heart Attack) వచ్చిన మొదటి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారు. ఈ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ సీపీఆర్ (CPR) చేయడం నేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ ఘటనలు యువతలో హృదయ ఆరోగ్యంపై కొత్త ప్రశ్నలు రేపుతున్నాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయక, సమయానికి పరీక్షలు, వ్యాయామం, సంతులిత ఆహారంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడమే ప్రమాదాలను నివారించే మార్గం.

Also Read : Using Black Mold Onion Dangerous : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు వినియోగిస్తున్నారా ..జర జాగ్రత్త

Exit mobile version