WHO Shocking Update : ప్రపంచంలో ప్రతి 100 మంది ఒంటరితనం వల్లే మరణిస్తున్నారు

ఇది ఓ నూతన మౌన మహమ్మారిలా మారుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు...

Hello Telugu - WHO Shocking Update

Hello Telugu - WHO Shocking Update

WHO : ఆధునిక జీవనశైలి, బిజీ షెడ్యూళ్లు, కుటుంబ సంబంధాల నుంచి దూరమవుతుండటంతో ప్రజలు ఒంటరితనానికి అలవాటుపడుతున్నారు. అయితే ఈ ఒంటరితనం ఇప్పుడు ఆరోగ్యాన్ని కాదు, ప్రాణాలను కూడా హరించేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.

WHO Key Comments

‘ఫ్రమ్ లోన్లీనెస్ టు సోషల్ కనెక్షన్’ అనే నివేదిక ప్రకారం, ప్రతి గంటకు ప్రపంచవ్యాప్తంగా 100 మంది ఒంటరితనం కారణంగా మరణిస్తున్నారని WHO వెల్లడించింది. ఇది ఓ నూతన మౌన మహమ్మారిలా మారుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒంటరితనం ప్రభావాలు:

గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం వంటి వ్యాధులు

మానసిక సమస్యలు – డిప్రెషన్, ఆత్మహత్యా ఆలోచనలు

జ్ఞాపకశక్తి లోపాలు, అల్జీమర్స్‌

అకాల మరణాల రిస్క్

భారత్‌లో పరిస్థితి:

దేశవ్యాప్తంగా 10.1% మంది ఒంటరితనం బారినపడుతున్నట్లు నివేదిక పేర్కొంది.

పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం మరింత ఎక్కువ.

16-24 ఏళ్ల యువతలో 40% మంది,

65-74 ఏళ్ల వృద్ధుల్లో 29% మంది ఒంటరితనం అనుభవిస్తున్నట్లు వెల్లడైంది.

కోవిడ్-19 తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైందని పరిశోధన చెబుతోంది.

ఆర్థిక నష్టం కూడా:

2024-25 ఆర్థిక సర్వే ప్రకారం, 2012 నుంచి 2030 మధ్య భారత్‌కు ₹1.03 ట్రిలియన్ రూపాయల ఆర్థిక నష్టం ఒంటరితనం, మానసిక ఆరోగ్య సమస్యల వల్ల సంభవించనుందని అంచనా.

పరిష్కార మార్గాలు:

రోజూ నడకలు, ఫిట్‌నెస్ యాక్టివిటీస్

కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలు పెంపొందించుకోవడం

డిజిటల్ డిటాక్స్ – స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం

వృద్ధులను పట్టించుకోవడం

సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం

సామాజిక సంబంధాలు సబలంగా ఉండాలి. ఒంటరితనం అనే మౌన వ్యాధిని మాటలతో, సంబంధాలతోే నయం చేయొచ్చు. ఇది వ్యక్తిగతమే కాదు — సమాజానికి సంబంధించిన బాధ్యతగా మారాల్సిన సమయం ఇదే.

Also Read : Anuloma Viloma Pranayam Interesting : ‘అనులోమ విలోమ’ ప్రాణాయామంతో 6 ఉపయోగాలు..

Exit mobile version