US White House Alarming : ట్రంప్ కు శాంతి బ‌హుమ‌తి ఇవ్వాలి – లీవిట్

డిమాండ్ చేసిన అమెరికా వైట్ హౌస్

Hello Telugu - US White House Alarming

Hello Telugu - US White House Alarming

White House : అమెరికా – ప్ర‌పంచ వ్యాప్తంగా యుద్దాలు జ‌ర‌గ‌కుండా నిరోధించ‌డంలో, శాంతియుతంగా ప‌రిష్కారం చూపేందుకు ప్ర‌య‌త్నం చేసినందుకు అమెరికా దేశాధ్య‌క్షుడు డొన‌ల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది యుఎస్ వైట్ హౌస్ . ఈ మేర‌కు వైట్ హౌస్ (White House) ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Leavitt) మీడియాతో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు ఇండియా – పాక్, థాయిలాండ్ – కంబోడియా, ఇజ్రాయెల్ – ఇరాన్, రువాండా – డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా – కొసావో, ఈజిప్ట్ – ఇథియోపియా మధ్య యుద్ధాలను ఆపాడని స్ప‌ష్టం చేవారు. సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణ చేయించాడని అందుకే పుర‌స్కారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

White House Demands

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా అనేక సంఘర్షణ ప్రాంతాలలో అనేక శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణలకు మధ్య వర్తిత్వం వహించారని పేర్కొన్నారు. శాంతి రంగంలో అధ్యక్షుడు ట్రంప్ థాయిలాండ్ , కంబోడియా మధ్య తక్షణ, బేషరతు కాల్పుల విరమణకు సహాయం చేశారని చెప్పారు. రెండు దేశాలు ప్రాణాంతకమైన ఘర్షణలో నిమగ్నమై ఉన్నాయని గుర్తించి రంగంలోకి దిగారన్నారు. ఈ రెండు దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల కార‌ణంగా దాదాపు 3 ల‌క్ష‌ల మందికి పైగా నిరాశ్ర‌యులుగా మారార‌ని అన్నారు క‌రోలిన్ లీవిట్.

థాయిలాండ్ తాత్కాలిక ప్రధాన మంత్రి , కంబోడియా ప్రధాన మంత్రితో నేరుగా ట్రంప్ ఫోన్‌లో మాట్లాడ‌ర‌ని, సంఘర్షణను ముగించక పోతే యుఎస్ లో ఎలాంటి వాణిజ్య చ‌ర్చ‌లు , ఒప్పందాలంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశార‌న్నారు. ఇదిలా ఉండ‌గా లోక్ స‌భ సాక్షిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ట్రంప్ పై. ఏ ప్రపంచ నాయకుడూ భారతదేశానికి త‌మ‌ ఆపరేషన్ ఆపమని చెప్పలేదని స్ప‌ష్టం చేశారు.

Also Read : Deputy CM Bhatti Vikramarka Proven : పూలే విజ్ఞాన్ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తాం

Exit mobile version