Heart Attack : మన రోజును ఎలా ఆరంభిస్తామన్నది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా గణాంకాల ప్రకారం, 2022లో ప్రపంచవ్యాప్తంగా 19.8 మిలియన్ల మంది గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించారు. ఇది మొత్తం మరణాలలో దాదాపు 32 శాతం, అందులో 85 శాతం గుండెపోటు, స్ట్రోక్ కారణంగానే చోటుచేసుకున్నాయి.
Heart Attack – ఉదయం ఎందుకు ప్రమాదకరం?
నిపుణుల వివరాల ప్రకారం, నిద్రలేవగానే శరీరంలో కొన్ని సహజ మార్పులు జరుగుతాయి:
- కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి.
- రక్తంలోని ప్లేట్లెట్స్ గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది.
- రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది.
ఈ మూడు అంశాలు కలిసినప్పుడు, ఉదయం సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ప్రమాద సమయం
అధ్యయనాల ప్రకారం, గుండెపోటు, ఆకస్మిక గుండె ఆగిపోవడం వంటి ఘటనలు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కూడా కొంత ప్రమాదం ఉంటుంది. అయితే ఉదయం సమయం మరింత కీలకం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జీవనశైలిలో జాగ్రత్తలు
- లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది, రక్తప్రవాహం సాఫీగా సాగుతుంది.
- ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగకూడదు.
- ఉదయం ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలు (గుడ్లు, పప్పుగింజలు) తీసుకోవాలి.
- మందులు వాడే వారు వాటిని సమయానికి తీసుకోవాలి.
నిపుణుల సూచన
చాలామంది గుండెపోటు ఒత్తిడి వల్లే వస్తుందని అనుకుంటారు. కానీ వైద్యుల ప్రకారం, ఒత్తిడి ఒక కారణం అయినప్పటికీ, ఉదయం మనం రోజును ఎలా ప్రారంభిస్తామన్నదే గుండె ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
Also Read : Bank Holidays Shocking : నేడు పలు బ్యాంకులు బంద్ కారణం ఇదే!
