Post Office : దీర్ఘకాల పెట్టుబడులకు ప్రభుత్వ పథకాలు, బాండ్లు, బ్యాంక్ డిపాజిట్లు భద్రమైన మార్గాలుగా ఎప్పటి నుంచో పరిగణించబడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. కారణం రిస్క్ చాలా తక్కువగా ఉండటమే కాకుండా హామీ ఇచ్చిన రాబడి అందించడం.
Post Office Scheme Updates
ప్రస్తుతం బ్యాంకులు కూడా మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో చాలా బ్యాంకులు తమ FD వడ్డీ రేట్లను తగ్గించాయి. కానీ పోస్టాఫీసు (Post Office) మాత్రం కస్టమర్లకు ముందున్నట్టే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది.
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (TD) పథకాల కింద 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలానికి FD చేయడానికి అవకాశం ఉంది. వీటిని కూడా బ్యాంకుల మాదిరిగానే ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. అయితే పోస్టాఫీసు (Post Office) వడ్డీ రేట్లు ప్రస్తుతం బ్యాంకుల కంటే కొంత మెరుగ్గా ఉన్నాయి.
పోస్టాఫీసు TD వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి:
- 1 సంవత్సరం డిపాజిట్‌కి 6.9%
- 2 సంవత్సరాల డిపాజిట్‌కి 7.0%
- 3 సంవత్సరాల డిపాజిట్‌కి 7.1%
- 5 సంవత్సరాల డిపాజిట్‌కి 7.5%
పోస్టాఫీసు TD ఖాతా కనీసం రూ.1,000 నుండి ప్రారంభించవచ్చు. దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. అందువల్ల పెద్ద మొత్తంలో కూడా భద్రంగా డిపాజిట్ పెట్టుకోవచ్చు.
ఒక వ్యక్తి తన భార్య పేరుతో పోస్టాఫీసులో రూ.1,00,000 రెండు సంవత్సరాల FD చేస్తే, 7% వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.1,14,888 వస్తాయి. ఇందులో రూ.14,888 వడ్డీ రూపంలో లభిస్తుంది.
ఈ పథకంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని కస్టమర్లకు ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే సాధారణ ప్రజలు, మహిళలు, సీనియర్ సిటిజన్లందరికీ ఒకే రకమైన రాబడి లభిస్తుంది.
మొత్తం మీద, పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌లు భద్రమైన పెట్టుబడి మార్గం కావడంతో పాటు బ్యాంకు FDల కంటే కొంత ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీర్ఘకాలం స్థిరమైన ఆదాయాన్ని ఆశించే వారికి ఇది మంచి ఎంపికగా మారింది.
Also Read : Stock Market Growth : వరుసగా రెండో రోజు లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్
