చైనా : యావత్ ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో నిమగ్నం అవుతుండగా డ్రాగన్ చైనా సంచలన ప్రకటన చేసింది. అందరూ విస్తు పోయేలా ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తమ జోలికి వచ్చే ఎవరిని ఊరికే వదిలి వేసే ప్రసక్తి లేదన్నారు. ఇదే క్రమంలో అమెరికా మద్దతుతో రెచ్చి పోతున్న తమ దేశం పక్కనే ఉన్న తైవాన్ గురించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ఏ దేశం కాపాడ లేదని ప్రకటించారు. తాను ఉన్నంత వరకు తైవాన్ కు చుక్కలు చూపిస్తూనే ఉంటానని అన్నాడు. అంతే కాదు తమ నుంచి విడి పోయిన తైవాన్ దేశాన్ని తాము కలుపుకుంటామని, దీనిని ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు జిన్ పింగ్.
ఈ సందర్బంగా చైనా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు దేశాధ్యక్షుడు. చైనా అధ్యక్షుడు తన దేశం సాధించిన ప్రగతి గురించి కూడా ప్రస్తావించారు. కృత్రిమ మేధస్సు , సెమీకండక్టర్ల వంటి రంగాలలో తన దేశం సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. అదే సమయంలో తన దేశం స్వయం పాలిత తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటుందని మరోసారి పట్టుబట్టారు. సైనిక సాంకేతికత, అంతరిక్ష పరిశోధనతో సహా కీలక రంగాలలో దేశం పురోగతిని ప్రత్యేకంగా ప్రశంసించారు. కుంగ్ ఫూ ప్రదర్శించే హ్యూమనాయిడ్ రోబోల నుండి కొత్త జలవిద్యుత్ ప్రాజెక్టుల వరకు చిత్రాలు ఆయన మాట్లాడుతుండగా తెరపైకి వచ్చాయి . తాము ఆవిష్కరణల ద్వారా అధిక-నాణ్యత అభివృద్ధికి శక్తినివ్వాలని ప్రయత్నించామని స్పష్టం చేశారు.
