Pawan Kalyan : అమరావతి : కొబ్బరి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా పర్యటనలో పర్యటించారు. ఈ సందర్బంగా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పరిధిలో తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లు. పరిశీలించారు. అనంతరం కొబ్బరి రైతులతో ఉప ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వారి సమస్యలను విన్నారు. రాజోలు నియోజకవర్గం కేశవ దాసు పాలెం వద్ద శంకరగుప్తం డ్రెయిన్ పొంగి పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. కొబ్బరి తోటల్లోకి నీరు చొచ్చుకు రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శంకరగుప్తం డ్రెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా? నీరు ఎంత కాలం పొలాల్లో ఉంటుంది? తదితర వివరాలపై ఆరా తీశారు.
DY CM Pawan Kalyan Focus
అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు. కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదన్నారు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ స్పష్టం చేశారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు 40 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం. సంక్రాంతి తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తో మీ ముందుకు వస్తామని అన్నారు. కోనసీమ పరిధిలో లక్ష ఎకరాల పరిధిలో సాగవుతున్న కొబ్బరి తోటలపై లక్ష కుటుంబాల ఆధారపడి ఉన్నాయని తెలిపారు పవన్ కళ్యాణ్. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. కోనసీమ రైతాంగానికి గొంతుకను అవుతానని, వారి సమస్యలు పరిష్కరించే గళాన్ని అవుతానని చెప్పారు.
Also Read : Nara Lokesh Important Meet : రామ్ లాల్ జీతో నారా లోకేష్ భేటీ
