Nara Lokesh Important Meet : రామ్ లాల్ జీతో నారా లోకేష్ భేటీ

దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఉత్స‌వాలు

Hello Telugu - Nara Lokesh Important Meet

Hello Telugu - Nara Lokesh Important Meet

Nara Lokesh : అమ‌రావ‌తి : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్ లాల్‌జీతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో సమావేశాలు నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు, సంస్థ విశిష్టతను ఈ సందర్భంగా రామ్ లాల్‌జీ వివరించారు. అనంతరం రామ్ లాల్ ను మంగళగిరిలో శాలువాతో మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. బాలల రాజ్యాంగం పుస్తకాన్ని బహూకరించారు.

IT Minister Nara Lokesh Meet Ramlal Jee

ఈ సంద‌ర్బంగా తెలుగుదేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీతో కూడిన డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ అద్బుతంగా ప‌ని చేస్తోంద‌ని రామ్ లాల్ జీకి స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్ . పేద‌లు, నిరుద్యోగులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగేలా అనేక సంక్షేమ ప‌థ‌కాలు , కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎన్ఎండీ ఫరూఖ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవిత, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా బాల వీరాంజనేయస్వామి, సత్యకుమార్ యాదవ్, ఆనం రాం నారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.

Also Read : Kavitha Strong Demand : బీసీల రిజ‌ర్వేష‌న్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాలి

Exit mobile version