అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, అధికారులు . అనంతరం చంద్రబాబు నాయుడు పొలాలను పరిశీలించారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. కొబ్బరి ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి ఎంత మేర పంట వస్తోందని ఆరా తీశారు. కోకో ఉత్పత్తులు బాగున్నాయంటూ ప్రశంసించారు. నర్సరీలను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. వ్యవసాయం, హర్టీకల్చర్ లో వీలైనంత రీసెర్చ్, ఎనాలసిస్ చేపట్టాలని స్పష్టం చేశారు
పామాయిల్ సాగులో టెక్నాలజీని వినియోగించేలా చూడాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు సూచించారు. ఈ సందర్బంగా కోకోనట్ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎక్కడా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత సర్కార్ పై ఉందన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు . ఇప్పటికే వ్యవసాయం దండుగ కాదని అది పండుగ అని చేసి చూపిస్తామన్నారు. అయితే గతంలో కంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని వాటిని గుర్తించి ఉపయగించుకునేలా చూడాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
















